- Telugu News Photo Gallery Cinema photos Mufasa The Lion King 2024 Trailer Released and gets huge response Telugu Entertainment Photos
Mufasa The Lion King: ముఫాసా ది లయన్ కింగ్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే రెస్పాన్స్.
హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఎవరు చూస్తారు..? చూసినా మన సినిమాలను డామినేట్ చేసే సత్తా ఉంటుందా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సినిమాలు వచ్చినపుడు.. మనోళ్లు కూడా కాస్త ఆలోచించాల్సిందే. అలాంటి సినిమానే ఇప్పుడొకటి వస్తుంది. దాని ట్రైలర్ కూడా విడుదలైందిప్పుడు. ఆ రీసౌండ్ ఇండియాలోనూ బాగానే వినిపిస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా.? హాలీవుడ్ సినిమాలే అయినా.. మార్వెల్ మూవీస్, సూపర్ హీరో సినిమాలకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది.
Updated on: Aug 12, 2024 | 9:21 PM

చిన్నప్పటి కేరక్టర్‌కు ఆయన చిన్న తనయుడు అబ్రం వాయిస్ ఇచ్చారు. సో.. ముఫాసా తనకు సో స్పెషల్ అని చెబుతున్నారు షారుఖ్. ఈ ఏడాది ఎండింగ్‌లో అటు షారుఖ్, ఇటు మహేష్ ఫ్యాన్స్ కి సిసలైన సెలబ్రేషన్స్ ముఫాసాతో మొదలు కానున్నాయన్నమాట.

అంతలోనే అవి మాయమవుతున్నాయి'' అంటూ మహేష్ వాయిస్ వినిపిస్తుంది. మహేష్ వాయిస్ కోసం ముఫాసా ట్రైలర్‌ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు అభిమానులు.

ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ చూస్తుంటే.. మీకూ అలాగే అనిపించిందా.? ఇంతకీ మీరు ట్రైలర్ చూశారా.? ముఫాసా ట్రైలర్ స్టార్ట్ కాగానే బ్రహ్మానందం చెప్పే డైలాగ్ బిగ్ రిలీఫ్.

దానికి తోడు.. 'ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని' అంటూ స్వయంగా సూపర్‌స్టార్ డిక్లేర్ చేయడంతో ముఫాసా మీద మరింత ఇష్టాన్ని పెంచుకుంటున్నారు అభిమానులు.

మిస్ అవుతున్నారా.? మిస్ కావద్దు.. నేను ఏదో రకంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను కదా.. నమ్మండి.. మన ప్లానింగ్స్ మనకున్నాయి.. డోంట్ వర్రీ అంటూ తన ఫ్యాన్స్ కి మహేష్ భరోసా ఇస్తున్నట్టే ఉంది.

మహేష్ వాయిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురూచూస్తున్న వారికి బ్రహ్మానందం వాయిస్ కిక్ ఇస్తుంది. ఆ మజాలో ఉండగానే, ''అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది.

డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది ఈ మూవీ. సౌత్‌లో ఈ సినిమాను మహేష్ సెలబ్రేట్ చేస్తుంటే, నార్త్ లో బాద్షా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఫాసా పెద్దయ్యాక వచ్చే పాత్రకు షారుఖ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.





























