Mahesh Babu: సూపర్ స్టార్ బర్త్ డే సప్పగా ముగియలేదు.. మహేష్ సినిమాపై ఒక చిన్న అప్‌డేట్.!
చిన్ని చిన్ని ఆనందాలతోనే మహేష్ బాబు బర్త్ డే అయిపోయింది. ఆగస్ట్ 9 కదా.. రాజమౌళి ఏదో ఒకటి చెప్తాడులే.. SSMB29 గురించి అప్‌డేట్ ఉంటుందిలే అని చివరి నిమిషం వరకు వేచి చూసినా ఫలితం రాలేదు. కానీ గుడ్డిలో మెల్ల అన్నట్లు.. చివర్లో మాత్రం చిన్న అప్‌డేట్ వచ్చింది. చేసేదేం లేక దాంతోనే సర్దుకున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలోనే బిజీ అయిపోయారు మహేష్ బాబు.