Mrunal Thakur: సినిమాల్లో మృణాల్ ఠాకూర్ గాడ్ ఫాదర్ ఆయనే
సీతారామమ్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమా మెమరీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. సీతా పాత్రతో తనకు వచ్చిన గుర్తింపు కెరీర్‌కు హెల్ప్ అయ్యిందన్న ఈ బ్యూటీ, ఆ సినిమాతోనే తనకు ఓ గాడ్ ఫాదర్ దొరికారని మురిసిపోతున్నారు. ఇంతకీ సీతారామం మృణాల్‌కు ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.
Updated on: Apr 15, 2024 | 9:41 PM

సీతారామమ్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమా మెమరీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. సీతా పాత్రతో తనకు వచ్చిన గుర్తింపు కెరీర్‌కు హెల్ప్ అయ్యిందన్న ఈ బ్యూటీ, ఆ సినిమాతోనే తనకు ఓ గాడ్ ఫాదర్ దొరికారని మురిసిపోతున్నారు.

ఇంతకీ సీతారామం మృణాల్‌కు ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.

సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ వరుసగా అలాంటి క్యారెక్టర్స్‌లోనే అలరించారు. తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

ప్రజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన కెరీర్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సీతారామం టైమ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అన్న ఈ బ్యూటీ, అతనే తనకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా మెంటర్ అంటున్నారు. అందుకే సీతారామం తనకు స్పెషల్ మూవీ అని గుర్తు చేసుకున్నారు మృణాల్.

సీతారామం సినిమా షూటింగ్ టైమ్‌లో ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్న సీత, ఆ సినిమా షూటింగ్ పూర్తయి వెళ్లిపోతున్నప్పుడు గుండె బద్దలైపోతున్నట్టుగా అనిపించిందన్నారు. ఓ సినిమా విషయంలో హీరోయిన్‌గా ఇంతగా ఎమోషనల్ అవ్వటం చాలా రేర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




