మైథలాజికల్ కాన్సెప్ట్స్ తో వస్తున్న వారసులు.. బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేసేనా
దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్నే ఎంచుకుంటున్నారు దర్శకులు. తాజాగా మరో వారసుడు సైతం ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు. మరి ఎవరా వారసుడు..? ఏంటా సినిమా..? ఈ మధ్యే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య.
Updated on: Sep 18, 2024 | 10:15 PM

తాజాగా జై హనుమాన్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, హనుమంతుడి పాత్రలో నటించటం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యింది.

ఈ మధ్యే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య. ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్‌తోనే సాగనుంది. తన యూనివర్స్‌లో భాగంగా ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ.

అచ్చం ఇలాగే సాయికుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ కూడా తన వారసుడిని దేవుడి నేపథ్యం ఉన్న కథతోనే లాంఛ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్‌తో మన దగ్గర కొన్ని సినిమాలు వచ్చాయి.

అందులో నిఖిల్ నటించిన కార్తికేయ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా రవిశంకర్ తనయుడు అద్వయ్ మొదటి సినిమా కూడా సుబ్మహ్మణ్య గుడి చుట్టూ తిరిగే కథతోనే వస్తుంది. ఈ సినిమాకు రవిశంకరే దర్శకుడు కూడా. టీజర్ చాలా ఆసక్తికరంగా కట్ చేసారు మేకర్స్.

కేజియఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఓ బావి.. అందులో పాములు.. చివర్లో రాముడు.. ఇలా టీజర్ అంతా ఆసక్తికరంగా ఉంది. 2025లో ఈ సినిమా విడుదల కానుంది.




