కుర్ర హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇస్తున్న మన్మథుడు బ్యూటీ అన్షు అంబానీ
నటి అన్షు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మన్మథుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అక్కినేని నాగార్జున సరసన నటించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. ఈ చిత్రంలోని "గుండెల్లో ఏముందో" పాటలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Updated on: May 19, 2025 | 4:01 PM

నటి అన్షు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మన్మథుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అక్కినేని నాగార్జున సరసన నటించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. ఈ చిత్రంలోని "గుండెల్లో ఏముందో" పాటలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా తర్వాత ఆమె ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఓ తమిళ్ సినిమాలోనూ నటించింది ఈ చిన్నది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది ఇటీవలే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.

21 సంవత్సరాల విరామం తర్వాత, ఆమె సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్‌లతో కలిసి "మజాకా" చిత్రంతో తెలుగు సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఫిబ్రవరి 28, 2025న విడుదలైంది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మజాకా సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. మరోసారి తన నటనకు మరోసారి ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే చేసేందుకు రెడీగా ఉంది అన్షు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్.

నిత్యం తన ఫ్యామిలీతోపాటు తన క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు మోడ్రన్ డ్రస్ లో మరింత అందంగా కనిపిస్తుంది. వయ్యారాల సింగారంతో ఫాలోవర్లను కట్టిపడేస్తుంది ఈ చిన్నది.