- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu's Guntur Kaaram To Nagarjuna, Raviteja And Venkatesh Movies Releasing On Sankranti 2024
Sankranti 2024: సంక్రాంతి బరిలో వెంకీమామా.. స్టార్ హీరోలతో సై అంటోన్న ‘సైంధవ’
2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాయి. జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు
Updated on: Oct 06, 2023 | 7:45 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి పండగ ఎంతో ప్రత్యేకముంది. సెలవులను క్యాష్ చేసుకునేందుకు బడ్జెట్ చిత్రాలు, చిన్న బడ్జెట్ చిత్రాలు ఈ పండగకు క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలో రాబోయే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది.

2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాయి. జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు

హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన చిత్రం ‘సైంధవ’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం 2024 జనవరి 13న విడుదల కానుంది. ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు .

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు.

వీటితో పాటు అక్కినేని నాగార్జున నా సామిరంగా సినిమా కూడా సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మాస్ మహరాజా రవితేజ నటించిన ఈగల్ కూడా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మరి ఈ పోటీలో మరిన్నిసినిమాలు వస్తాయా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.




