ఒక పాత ఇంటర్వ్యూలో శ్రద్ధ తండ్రి నటుడు శక్తి కపూర్ ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ.. శ్రద్ధ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి తండ్రి తన కుమార్తె మంచి, గౌరవప్రదమైన కుటుంబంలోకి వివాహం చేసుకుని వెళ్లాలని కోరుకుంటాడు. నా కూతురు వృత్తి జీవితంలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కాని తల్లిదండ్రులుగా పిల్లలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహం చేసే కాలం ఇప్పుడు పోయింది. వారి జీవిత భాగస్వాములను వారే ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా కూతురు తన కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. ఆమె తన మ్యారెజ్ ప్లాన్ గురించి మాకు చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా నచ్చిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.