- Telugu News Photo Gallery Inspirational Good Morning Quotes to Start Your Day in Telugu Telugu Quotes Photos
Good Morning Quotes: ఉదయాన్నే మీలో స్ఫూర్తిని నింపే సందేశాలు.. మిస్ కావొద్దు.
ఈ రోజు వచ్చిన అవకాశం మళ్లీ రేపు రాకపోవచ్చు.. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్టే...ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది.. మిత్రమా..! ఎల్లప్పుడూ అదృష్టాం ఒక్కదాన్నే నమ్ముకోవద్దు.. కేవలం అదృష్టంతో జీవితంలో ఒక్కరైనా బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.
Updated on: Oct 06, 2023 | 8:08 AM

ఈ రోజు వచ్చిన అవకాశం మళ్లీ రేపు రాకపోవచ్చు.. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.

తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్టే...ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది..

మిత్రమా..! ఎల్లప్పుడూ అదృష్టాం ఒక్కదాన్నే నమ్ముకోవద్దు.. కేవలం అదృష్టంతో జీవితంలో ఒక్కరైనా బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.

నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది.. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్యా నీకు చిన్నదిగానే కనిపిస్తుంది.

ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటే అది బలహీనత కాదు.. మౌనం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలుసుకోండి.

కళ్ళు మూసుకుని భవిష్యత్ గురించి కలలు కనడం కాదు.. ఆ కలల సాకారం కోసం కృషి, పట్టుదల కూడా ఉండాలి.

మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్ణయిస్తాయి.. బలహీనులని మీరు భావిస్తే బలహీనులే అవుతారు.. శక్తివంతులని భావిస్తే మీరు శక్తివంతులే అవుతారు.

దీపం కాంతి ఇంటిలో వెలుగును ఇస్తుంది.. మంచి ఆలోచన జీవితానికి దారిని చూపిస్తుంది.

ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు.. మొదటి అడుగు నువ్వు వేస్తే జీవితంలో ఎదుగుదల నీ సొంతం అవుతుంది.




