- Telugu News Photo Gallery Cinema photos Actress Kiara Advani gets more Movie offers after marriage Details Here Telugu Actress Photos
Kiara Advani: పెళ్లి తర్వాత కూడా తగ్గని కియారా జోరు.. వరసబెట్టి సినిమాలు క్యూ.
పెళ్లైతే హీరోయిన్ల జోరు తగ్గుతుందా.. ఛాన్సులు నిజంగానే తగ్గిపోతాయా.. ఏ కాలంలో ఉన్నారు మీరు..? ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి.. ఇప్పుడలా కాదు.. పెళ్లైనా తగ్గేదే లే అంటున్నారు మన బ్యూటీస్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నారు.తాజాగా ఈ లిస్ట్‌లోకి కియారా కూడా చేరిపోయారు. పెళ్లి తర్వాత ఈమెకు సెన్సేషనల్ ఆఫర్స్ వస్తున్నాయి.. మరేంటవి..?
Updated on: Oct 06, 2023 | 12:12 PM

పెళ్లైతే హీరోయిన్ల జోరు తగ్గుతుందా.. ఛాన్సులు నిజంగానే తగ్గిపోతాయా.. ఏ కాలంలో ఉన్నారు మీరు..? ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి.. ఇప్పుడలా కాదు.. పెళ్లైనా తగ్గేదే లే అంటున్నారు మన బ్యూటీస్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి కియారా కూడా చేరిపోయారు. పెళ్లి తర్వాత ఈమెకు సెన్సేషనల్ ఆఫర్స్ వస్తున్నాయి.. మరేంటవి..? పెళ్లి తర్వాత ఛాన్సులు రావనే కాన్సెప్టే లేదిప్పుడు.. ఇంకా మాట్లాడితే ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్‌కు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.

సౌత్‌లో నయనతార, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి బ్యూటీస్ ఇప్పటికీ దూసుకుపోతున్నారు. నార్త్‌లో దీపిక పదుకొనే నెంబర్ వన్ హీరోయిన్. ఈమెకు పెళ్లై 4 ఏళ్లవుతుంది. తాజాగా కియారా అద్వానీ సైతం వరస అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఈ మధ్యే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా.. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఈ మధ్యే కార్తిక్ ఆర్యన్‌తో నటించిన సత్యప్రేమ్ కీ కథ విడుదలైంది. ఇక తెలుగులో రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్ర షూట్ కొన్ని రోజులుగా జరగట్లేదు.. దాంతో బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. అక్కడ ఈమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. కియారా అద్వానీకి తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2లో హీరోయిన్‌గా కియారా ఎంపికయ్యారని తెలుస్తుంది.

ఇదే విషయం కియారాను అడిగితే ప్రొడక్షన్ హౌజ్ చెప్తారులెండీ అన్నారే కానీ అబద్ధం అని మాత్రం చెప్పలేదు. దాంతో పాటు తెలుగులోనే మరో భారీ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా ఈ భామకు ఛాన్సులొస్తూనే ఉన్నాయి.




