లియో రిలీజ్ తరువాత ఖైదీ, విక్రమ్, లియో సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను కనెక్ట్ చేస్తూ వాటి టైమ్స్ లైన్స్‌ను డీకోడ్ చేశారు. అయితే అవి ఎంత వరకు కరెక్ట్ అన్నది క్లారిటీ లేదు. అందుకే ఖైదీ 2 రిలీజ్‌కు ముందు ఎల్‌సీయూ విషయంలో క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ లోకేష్. 10 నిమిషాల నిడివితో ఎల్‌సీయూ కనెక్షన్స్‌ను రివీల్ చేస్తూ ఓ షార్ట్ ఫిలింను రిలీజ్ చేయబోతున్నారు.