- Telugu News Photo Gallery Cinema photos Suriya Kanguva to Pawan kalyan Ustaad Bhagat Singh latest movie updates from industry
Movie Updates: కంగువా నుంచి క్రేజీ అప్డేట్.. ఉస్తాద్ రూమర్స్‌పై క్లారిటీ..
కంగువా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. కిరణ్ అబ్బవరం 'క' మూవీ తెలుగులో మాత్రమే విడుదల. సూపర్ హిట్ అరణ్మనై సిరీస్‌లో నెక్ట్స్ ఇన్‌స్టాల్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు నెల్సన్. ఉస్తాద్ భగత్ సింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమాలు కొన్ని అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Oct 29, 2024 | 3:15 PM

Kanguva

అక్టోబర్ 31 క సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుందని వెల్లడించారు మేకర్స్. మలయాళంలో దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్ ఉండటం, తమిళ్‌లో ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవటంతో తెలుగు తప్ప మిగతా భాషల రిలీజ్ వాయిదా వేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు.

సూపర్ హిట్ అరణ్మనై సిరీస్‌లో నెక్ట్స్ ఇన్‌స్టాల్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సిరీస్‌లో ఐదో భాగం త్వరలో సెట్స్ మీదకు వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నటి ఖుష్బూ ఖండించారు. ప్రస్తుతానికి నెక్ట్స్ పార్ట్‌కు సంబంధించి ఎలాంటి ఆలోచనా చేయటం లేదన్నారు.

తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అల్లు అర్జున్‌కు ఓ కథ చెప్పిన మాట వాస్తవమే అయినా ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నారు. తాను నెక్ట్స్ చేయబోయే సినిమా జైలర్ 2నే అని క్లారిటీ ఇచ్చారు నెల్సన్.

పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ తేరికి రీమేక్ అంటూ జరుగుతున్న ప్రచారంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. రీమేక్ రూమర్స్‌ను ఖండించారు స్క్రీన్‌ప్లే రైటర్ దశరద్.




