OG Movie: పక్కా ప్లానింగ్‌తో పవన్ కళ్యాణ్ ఓజీ.. దానికి తగ్గట్టే సుజీత్ షెడ్యూల్స్ ప్లాన్..
మొన్ననే మాట్లాడుకున్నాం కదా... కొన్ని సినిమాలు అంతే. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు పికప్ అయ్యాయి, ఎప్పుడు ఫినిష్ అయ్యానని ఆశ్చర్యపోయేలా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి అని.. యస్ ఇప్పుడు ఓజీ అలాంటి సినిమానే అవుతోంది. క్విక్‌గా రెడీ అవుతున్న పవర్‌మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తోంది ఓజీ... పవన్ కల్యాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. సినిమా అనౌన్స్ మెంట్ సమయం నుంచే పవర్‌స్టార్ ఫ్యాన్స్ లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఓజీ సినిమా.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Sep 25, 2023 | 1:46 PM

మొన్ననే మాట్లాడుకున్నాం కదా... కొన్ని సినిమాలు అంతే. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు పికప్ అయ్యాయి, ఎప్పుడు ఫినిష్ అయ్యానని ఆశ్చర్యపోయేలా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి అని.. యస్ ఇప్పుడు ఓజీ అలాంటి సినిమానే అవుతోంది. క్విక్‌గా రెడీ అవుతున్న పవర్‌మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తోంది ఓజీ...

పవన్ కల్యాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. సినిమా అనౌన్స్ మెంట్ సమయం నుంచే పవర్‌స్టార్ ఫ్యాన్స్ లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఓజీ సినిమా. సుజీత్ పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ముందుగానే పవర్‌స్టార్ కాల్షీట్‌ని కనుక్కుని, అర్థం చేసుకుని, దానికి తగ్గట్టే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారట సుజీత్.

ప్రస్తుతం ఉస్తాద్ మూవీ షూటింగ్‌లో ఉన్నారు పవన్ కల్యాణ్. పొలిటికల్‌గా మరీ అర్జన్సీ ఉన్నప్పుడు గ్యాప్ తీసుకుంటున్నారే తప్ప, మిగిలిన సమయాన్ని ఉస్తాద్ సెట్స్ లోనే స్పెండ్ చేస్తున్నారట పవర్‌స్టార్.

ఈ నెల 26 వరకు ఉస్తాద్ షూటింగ్‌లో బిజీగా ఉంటారు. గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, ఆడియన్స్ లోనూ ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. వాటిని మీట్ అయ్యేలాగా కంటెంట్ రెడీ చేశారట హరీష్ శంకర్. సినిమాకు ప్లస్ అవుతుందనుకున్న ప్రతి విషయాన్ని కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ చేసేస్తున్నారట పవన్.

అటు ఓజీ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను చాలా వరకు కంప్లీట్ చేసేశారట సుజీత్. ఇప్పుడు ఈ నెల 27 నుంచి పవర్ పార్టిసిపేషన్‌తో మిగిలిన సీన్స్ ని తీయడానికి రెడీ అవుతున్నారట సుజీత్. చాన్నాళ్ల తర్వాత ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ ని మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నానని సంబరపడ్డ పవన్, అంతే ఉత్సాహంతో ఓజీకి కాల్షీట్లు కేటాయించేశారట.





























