- Telugu News Photo Gallery Cinema photos Parineeti Chopra and Raghav Chadha share their wedding photos for first time
Parineeti Chopra: పెళ్లిపీటలెక్కిన బాలీవుడ్ బ్యూటీ.. వైరల్‌గా మారిన పెళ్లి ఫోటోలు
బాలీవుడ్ అందాల భామ పరిణితి చోప్రా పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. పరిణీతి చోప్రా, రాజకీయ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాను వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 24 సాయంత్రం 6.30 లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. గతః కొంతకాలంగా ఏ జంట ప్రేమలో తేలిపోతున్నారు. వీఐర్ పెళ్లిగురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Updated on: Sep 25, 2023 | 1:44 PM

బాలీవుడ్ అందాల భామ పరిణితి చోప్రా పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. పరిణీతి చోప్రా, రాజకీయ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాను వివాహం చేసుకుంది.

సెప్టెంబర్ 24 సాయంత్రం 6.30 లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. గతః కొంతకాలంగా ఏ జంట ప్రేమలో తేలిపోతున్నారు. వీఐర్ పెళ్లిగురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్‌లో పరిణితి చోప్రా, రాఘవ్ చద్ధా వివాహం అంగరంగవైభవంగా జరిగింది. వీరి వివాహం కోసం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పరిణితి చోప్రా, రాఘవ్ చద్ధా వివాహానికి భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. వీరి వివాహం కోసం మహారాజ్ సూట్ ను బుక్ చేశారట. దీని కోసం ఒక్క రోజుకే 10 లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.

వీరి వివాహానికి చాలా తక్కువ మంది సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ల ఈ వివాహానికి హాజరయ్యారట. అలాగే సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా కూడా హాజరయ్యారని తెలుస్తోంది.





























