- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Worked in Coffee Shop Before Film Industry, She Is Shraddha Kapoor
Tollywood: ఒకప్పుడు కాఫీ షాప్లో పనిచేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ పక్కన హీరోయిన్గా..
ఒకప్పుడు కాఫీ షాపులో పనిచేసిన అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమాతో సెన్సెషన్ సృష్టించింది.
Updated on: Oct 27, 2024 | 12:58 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. చిన్న వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. చిన్న వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

16 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ నటించిన లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికీ నటిగా తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఈ వయ్యారి. ఆ తర్వాత ఏడాది తీన్ పట్టి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది.

కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా ప్లాప్ అయ్యాయి. కానీ హీరో ఆదిత్య రాయ్ సరసన నటించిన ఆషికీ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది శ్రద్ధా కపూర్. ఇటీవలే స్త్రీ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.





























