NTR – War 2: సౌత్, నార్త్ హీరోల కాంబోలో ఫోకస్ ప్రాజెక్ట్ గా వార్ 2.! యుద్ధభూమిలో తారక్ అడుగు.
ప్యాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రాజెక్టుల్లో వార్ మూవీకి స్పెషల్ ప్లేస్ ఉంది. వార్2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసే ఆడియన్స్ కూడా ఎక్కువే. అలాంటివారికి గుడ్‌న్యూస్ చెప్పేశారు మేకర్స్. కౌంట్ డౌన్‌ని ఒన్ వీక్‌కి సెట్ చేసుకోండి అని సిగ్నల్స్ పంపేశారు. నార్త్ లో వార్ వార్తలు మోగుతుంటే, మన వారి చూపు మొత్తం తారక్ మీదే ఉంటుంది.. సంగతేంటి దేవర? ఇక్కడ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు?