సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విదేశాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కొద్దిరోజుల క్రితం నుంచి రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి. ఇండియాలో సెప్టెంబర్ 23 సాయంత్రం నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి.