- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Urmila Matondkar left many movies just because of Director RGV
RGV : ఆర్జీవీ సినిమాలకోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వదులుకుంది.. కట్ చేస్తే
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా మంది హీరోయిన్స్ తో పని చేశారు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను కూడా అందించాడు. అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించడానికి ఓ హీరోయిన్ తనకు వచ్చిన ఆఫర్స్ ను వదులుకుందట. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
Updated on: Sep 25, 2024 | 9:04 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా మంది హీరోయిన్స్ తో పని చేశారు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను కూడా అందించాడు. అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించడానికి ఓ హీరోయిన్ తనకు వచ్చిన ఆఫర్స్ ను వదులుకుందట. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె మరెవరో కాదు ఊర్మిళ మటోండ్కర్. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఊర్మిళ. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌లో చాలా మంది ప్రముఖులతో కలిసి పనిచేసింది. అంతే కాదు ఈ భామ బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అందించింది. అయితే ఇప్పుడు ఈ నటి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది.

హిందీ సినిమాలోని ఓ పాట షూటింగ్‌లో ఊర్మిళ చేసిన డ్యాన్స్‌ని రామ్‌గోపాల్ వర్మ ఇష్టపడ్డారు. ఆతర్వాత రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' చిత్రానికి ఊర్మిళను ఎంపిక చేశారు. 'రంగీలా' హిట్ తర్వాత రామ్‌గోపాల్ ప్రతి సినిమాలోనూ ఊర్మిళ ఉండేది.

వీరి బంధంపై అభిమానుల్లో చర్చ కూడా నడిచింది. రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేయడానికి ఊర్మిళ చాలా మంది దర్శకుల చిత్రాలను తిరస్కరించిందని తెలుస్తోంది. రాంగోపాల్ వర్మతో సంబంధం ముగిసిన తర్వాత ఊర్మిళ కష్టాలను ఎదుర్కొంది.

ఆ తర్వాత ఊర్మిళకు సినిమా ఆఫర్లు రావడం మానేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌ని వదిలి రాజకీయాల వైపు మళ్లింది. కానీ నటి రాజకీయాల్లో కూడా విజయం సాధించలేదు. 2016లో వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. అలాగే ఊర్మిళ తన భర్త కంటే 10 సంవత్సరాలు పెద్దది. ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోతున్నారని తెలుస్తోంది.