చేతిలో పువ్వుతో, చీరలో అందంగా జాన్వీ.. మరింత వికసిస్తున్నాను అంటూ క్యాప్షన్!
అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతిలోక సుందరీ గారాల పట్టీగా ఈబ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో పింక్ షిఫాన్ చీరలో అందంగా రెడీ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Aug 16, 2025 | 4:57 PM

జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొతం. ఈ అమ్మడు జూనీయర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దేవర మూవీలో తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

దీంతో ఈ అమ్మడుకి ఇటు తెలుగులో అటు బాలీవుడ్ నుంచి ఎక్కువగా ఆఫర్స్ రావడంతో ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్దీ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.

మరో వైపు జాన్వీ కపూర్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర సరసన పరం సుందరి మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుండటంతో జాన్వీ ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. హీరోతో కలిసి పరం సందరి ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ చీరలో అందంగా రెడీ పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో జాన్వీని చూస్తే మతిపోవాల్సిందే.

పింక్ కలర్ చీరలో.. సింపుల్ లుక్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ బ్యూటీ. ఇక ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఈ సుందరి మీ ప్రేమను చూస్తూ మరిం వికసిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.



