Jabardasth varsha: బార్బీ బొమ్మలా ముస్తాబైన ముద్దుగుమ్మ వర్ష .. ఎంత క్యూట్ గా ఉందో..!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన అందాల భామల్లో వర్ష ఒకరు. అందం అభినయం కలిగిన ఈ బ్యూటీ జబర్దస్త్ వేదిక పై పలు స్కిట్ లు చేసి ప్రేక్షకులను నవ్వించింది. ముఖ్యంగా ఇమాన్యుల్‌తో కలిసి వర్ష చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు ఆతర్వాత పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకునే వర్ష.. సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది.