
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. అయినా ఆల్రెడీ ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆడియోను భారీ మొత్తానికి టీ సిరీస్ సొంతం చేసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ అయితే ఇండస్ట్రీ జనాలకే షాక్ ఇచ్చాయి. రిలీజ్‌కు ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎఫెక్ట్, ఆఫర్ట్ రిలీజ్ కూడా గట్టిగా కనిపించింది.

అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న చిరు, బాలయ్య, విజయ్ దేవరకొండ సినిమాల విషయంలోనూ క్రేజ్ ఇదే రేంజ్‌లో ఉంది.

తమిళ సినిమా జననాయగన్ కూడా భారీ బిజినెస్ చేస్తోంది. విజయ్ ఆఖరి సినిమా కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే కేవలం తమిళనాడు థియేట్రికల్ హక్కులే వంద కోట్ల ధర పలికాయన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఓవర్ సీస్ రైట్స్ కూడా 78 కోట్లకు అమ్ముడయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రీ రిలీజ్ క్రేజ్ వల్ల నష్టపోతున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా కంగువా, ఇండియన్ 2 సినిమాల తెలుగు హక్కులు 50 కోట్ల చొప్పున తీసుకున్నారు. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అందుకే అన్ని సార్లు క్రేజ్‌ను చూసి కోట్లు గుమ్మరియటం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.