- Telugu News Photo Gallery Cinema photos Is Nidhhi Agerwal following Mrunal Thakur route by selecting family oriented movies
థింక్ డిఫరెంట్.. మృణాల్ రూట్ లో నిధి అగర్వాల్ ??
సినిమాలు ప్రేక్షకాదరణ పొందినప్పుడు సక్సెస్ అయ్యాయని సంబరాలు జరుపుకుంటారు. కానీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడే సంబరాలు చేసుకునే వాళ్లు కూడా ఉంటారా? ఎందుకు ఉండరు.. నేనున్నానుగా అని అంటున్నారు నిధి అగర్వాల్. అంతే కాదు, ఈ అమ్మడికి మృణాల్‌తోనూ ఓ పోలిక ఉంది.. అదేంటో చూసేద్దాం పదండి..
Updated on: Feb 20, 2025 | 1:23 PM

సినిమా నేపథ్యం లేకుండా నిలదొక్కుకుంటున్నందుకు తనను తాను అప్రిషియేట్ చేసుకుంటానన్నారు నిధి అగర్వాల్. అంతే కాదు, మంచి సినిమాలో అవకాశం రావడమే విజయంతో సమానంగా భావిస్తానని చెప్పారు.

ఎక్కువ సినిమాలు చేయాలని అందరిలాగానే తనకూ ఉంటుందనీ, కాని తనకు తాను పెట్టుకున్న ఓ షరతు వల్ల అది జరగడం లేదని చెప్పారు నిధి. వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి తానేం హీరో కాదంటున్నారు నిధి అగర్వాల్.

నాయికలు... వరుసగా కమర్షియల్ స్క్రిప్టులు సెలక్ట్ చేసుకున్నా విమర్శలు తప్పవన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. అందుకే గొప్ప కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తానన్నారు. సేమ్ ఇలాంటి మాటే రీసెంట్‌గా చెప్పారు మృణాల్.

ఎక్కడి నుంచి ఏ కథ వచ్చినా, అందులో తన కేరక్టర్‌ని గో త్రూ చేస్తానన్నారు మృణాల్. మంచి కథ ఉంటే ఏ ఇండస్ట్రీలోనైనా పనిచేయడానికి రెడీ అని తెలిపారు.

హీరోలను బట్టి కాదు, స్క్రిప్టులను బట్టే తన సెలక్షన్ ఉంటుందన్నారు ఈ బ్యూటీ. సో దీన్ని బట్టి.. ఓ వైపు కమర్షియల్, ఇంకో వైపు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్టులకు ఓటేస్తున్నారన్నమాట మన నాయికలు.




