- Telugu News Photo Gallery Cinema photos Is Heroine Sai pallavi next movie ramayana update in this week Telugu Actress Photos
Sai Pallavi: చిన్న గ్యాప్ అంతే.! వరసబెట్టి సినిమాలతో బిజీ బిజీగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.
ఒన్ ఇండియా ఒన్ సినిమా కాన్సెప్ట్ కి జై కొడుతున్నారు సాయిపల్లవి. ఇప్పటిదాకా సౌత్‌లో చేశాను. ఇక ఉత్తరాది సినిమాల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె చేతిలో సౌత్‌లో రెండు, నార్త్ లో రెండు సినిమాలున్నాయి. బట్.. ఆ తర్వాత ఏంటి? అంటే.. మాత్రం అందరూ ఉత్తరాది వైపే చూస్తున్నారు.. పల్లవి మనసులో మాట అదేనా.? లవ్‌స్టోరీ కాంబోతో తెరకెక్కుతోంది తండేల్. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు చైతూ అండ్ పల్లవి.
Updated on: Apr 17, 2024 | 7:06 PM

ఒన్ ఇండియా ఒన్ సినిమా కాన్సెప్ట్ కి జై కొడుతున్నారు సాయిపల్లవి. ఇప్పటిదాకా సౌత్‌లో చేశాను. ఇక ఉత్తరాది సినిమాల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె చేతిలో సౌత్‌లో రెండు, నార్త్ లో రెండు సినిమాలున్నాయి.

బట్.. ఆ తర్వాత ఏంటి? అంటే.. మాత్రం అందరూ ఉత్తరాది వైపే చూస్తున్నారు.. పల్లవి మనసులో మాట అదేనా.? లవ్‌స్టోరీ కాంబోతో తెరకెక్కుతోంది తండేల్. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు చైతూ అండ్ పల్లవి.

దేశభక్తిని, నేటివిటీని, ప్రేమను కలిపి తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే తెగ వైరల్ అవుతోంది. తెలుగులో తండేల్ చేస్తున్నట్టే, తమిళ్‌లో శివకార్తికేయన్‌తో అమరన్ సినిమాలో నటిస్తున్నారు సాయిపల్లవి.

అమరన్‌లో శివకార్తికేయన్ భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాకు కమల్‌హాసన్ కూడా ఓ నిర్మాత. సౌత్‌లో తండేల్, అమరన్ చేస్తూనే నార్త్ లో ఆమీర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఇటీవల జపాన్‌లో కీ పోర్షన్ షూట్ చేశారు. వేలంటైన్స్ డే సందర్భంగా చైతన్య చేసిన తండేల్ రీల్‌కి కూడా జునైద్ షూటింగ్ స్పాట్ నుంచే తన పార్ట్ ఫుటేజ్ పంపారు సాయిపల్లవి. బాలీవుడ్ ప్రెస్జీయస్‌గా తీసుకుంటున్న నితీష్ తివారి రామాయణంలోనూ సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు.

ఈ వారంలోనే ఆమె కేరక్టర్‌కి సంబంధించిన ప్రకటన రావచ్చనే టాక్ వినిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు. రావణుడిగా యష్ నటిస్తారు.

సౌత్‌లోలాగానే, నార్త్ లోనూ తన ఇమేజ్‌కి తగ్గ పాత్రలనే సెలక్ట్ చేసుకుంటున్నారు పల్లవి. దీన్ని బట్టి, ఇక ఆమె ఫుల్‌ఫోకస్ నార్త్ మీదే ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు క్రిటిక్స్.



