- Telugu News Photo Gallery Cinema photos Huge Response for Ram Charan Game Changer Song Details Here Telugu Heroes Photos
Game Changer: గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
మోస్ట్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ పాట వచ్చేసింది.. ముందుగానే లీక్ అయినా కూడా ఏం మార్చకుండా కాస్త కొత్త టచ్ ఇచ్చి అదే పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మరి జరగండి జరగండి పాటకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా..? గ్రాండియర్ ఉందా లేదా..? భారీ ఖర్చు స్క్రీన్ మీద కనిపించిందా..? శంకర్ సినిమాల కంటే పాటలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది..
Updated on: Mar 29, 2024 | 9:21 PM

మోస్ట్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ పాట వచ్చేసింది.. ముందుగానే లీక్ అయినా కూడా ఏం మార్చకుండా కాస్త కొత్త టచ్ ఇచ్చి అదే పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మరి జరగండి జరగండి పాటకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా..? గ్రాండియర్ ఉందా లేదా..?

భారీ ఖర్చు స్క్రీన్ మీద కనిపించిందా..? శంకర్ సినిమాల కంటే పాటలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది.. ఎందుకంటే పాటల కోసం మీడియం బడ్జెట్ సినిమాలకు సరిపోయే ఖర్చు పెట్టిస్తుంటారు.

ఇప్పుడు గేమ్ ఛేంజర్‌కు కూడా ఇదే జరుగుతుంది. ఇందులోని జరగండి జరగండి పాట కోసం ఏకంగా 16 కోట్లు ఖర్చు చేయించారనే వార్తలే ఇండస్ట్రీని షేక్ చేసాయి.. ఇప్పుడీ పాట వచ్చేసంది.

అయినా సక్సెస్ రావాలంటే.. సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి, మేకింగ్ వండర్‌ఫుల్‌గా ఉండాలి, రిలీజ్‌కి పర్ఫెక్ట్ సీజన్ కుదరాలి.. ఇంకా ఎన్నె.. ఎన్నెన్నో.! వాటన్నిటినీ వదిలేసి, విజయానికీ... హీరో, హీరోయిన్ల పెయిర్‌కీ... లింక్ పెట్టడం ఏంటన్నది తండ్రీ కొడుకుల ఒపీనియనేమో..అని అంటున్నారు విశ్లేషకులు.

అలాగే పాటలో కొన్ని మార్పులు కూడా చేసారు. ఈ పాట కోసం పెట్టిన ఖర్చు.. ఆ భారీతనం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చలం రాసిన ప్రేమలేఖలు పుస్తకంతో రామ్ చరణ్ ఈ పాటలో ఎంట్రీ ఇచ్చారు.

పాట మొత్తం కలర్ ఫుల్‌గా ఉంది. థమన్ మరోసారి ఎనర్జిటిక్ మాస్ ట్యూన్ ఇచ్చారు. ఇన్‌స్టంట్‌గా ఈ పాట ఎక్కుతుందో లేదో తెలియదు కానీ రిలీజ్ టైమ్ వరకు మాత్రం.. అందరి నోళ్లలో నానడం అయితే ఖాయం. మొత్తానికి జరగండి జరగండి.. ప్రస్తుతానికి ఫుల్ ట్రెండింగ్ అంతే.





























