- Telugu News Photo Gallery Cinema photos Prabhas Next Movie with lokesh kanagaraj is stopped due to some reason Update details Telugu Heroes Photos
Prabhas: ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా.! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్..! అనౌన్స్ చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఒకటి.. మొదలు కాకుండానే అటకెక్కిందిప్పుడు. ఇదివరకు ఓ సినిమానే ఇలాగే ఆగిపోతే అయ్యో రామా అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు ప్రభాస్ సినిమాలు ప్రకటించాక కూడా ఎందుకు ఆగిపోతున్నాయి..? సమస్య ఎక్కడుంది.? ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే అనౌన్స్ చేసినంత ఈజీ కాదిప్పుడు.
Updated on: Mar 29, 2024 | 9:27 PM

మాహిష్మతి ప్రజలు అతని పేరును అంతలా జపిస్తున్నప్పుడు, అతని రాకను ఎవరూ ఆపలేరు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు రాజమౌళి.

ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే అనౌన్స్ చేసినంత ఈజీ కాదిప్పుడు. ఇప్పుడు కథ రాసుకుని వెళ్తే.. ఆ దర్శకుడి టోకన్ నెంబర్ వచ్చేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకే ప్రభాస్‌తో సినిమాలు ప్రకటించిన తర్వాత కూడా ఆగిపోతున్నాయి.

ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ ఇలాగే ఆదిలోనే అటకెక్కింది. పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేసారు.

అప్పట్లో నిర్మాతలు వెళ్లి దర్శకుడిని కలిసారు కూడా. అయితే బాలీవుడ్‌లో సిద్ధార్థ్ ఆనంద్, టాలీవుడ్‌లో ప్రభాస్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. తాజాగా మరో సినిమా కూడా అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయింది.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ సినిమా ఒకటి ప్లాన్ చేసారు. ప్రస్తుతం లియో 2, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలకు కమిటయ్యారు లోకేష్. వాటికంటే ముందు రజినీ సినిమా చేయాల్సి ఉంది.

మరోవైపు ప్రభాస్ కూడా సలార్ 2, కల్కి, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కమిటయ్యారు. ప్రభాస్ 4 సినిమాలు.. లోకేష్ కనకరాజ్ 4 సినిమాలు చేయాల్సి ఉండటంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా ఆగిపోయింది.

ప్రభాస్ సినిమా చేసే టైమ్ తన దగ్గర లేదని తేల్చేసారు లోకేష్ కనకరాజ్. మొత్తానికి ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు.. అది పట్టాలెక్కించడానికి చాలా ఓపిక కూడా ఉండాల్సిందే.!




