- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary Red Dress Photos goes viral in social media on June 2024 Telugu Actress Photos
Meenakshi Chaudhary: రెడ్ హాట్ చిల్లీ లా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.. నీకిది న్యాయమా.!
విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ మీనాక్షి చౌదరి..! కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. ఇప్పుడు మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.
Basha Shek | Edited By: Ram Naramaneni
Updated on: Jun 25, 2024 | 10:09 PM

విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ మీనాక్షి చౌదరి..!

కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. ఇప్పుడు మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుంది.

2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి. తెలుగుతో పాటు తమిళంలోనూ దున్నేస్తున్నారు.

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్‌తో పాటు విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ.. వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి.

ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న GOATలోనూ మీనాక్షే హీరోయిన్. సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది.





























