AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు.. పోలీసులు చూడగా

భాగ్యనగరంలో ఓ పక్కన అందరూ హోళీ జరుపుకుంటుంటే.. మరో పక్క ధూల్‌పేట్‌లో చిత్రవిచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు.? ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..? లేట్ ఎందుకు ఒకసారి లుక్కేయండి. పోలీసులు వెళ్లి చూడటంతో.. అంతా షాక్ అయ్యారు.

Hyderabad: కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు.. పోలీసులు చూడగా
Kulfi Icecreams
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 14, 2025 | 8:50 PM

Share

హైదరాబాద్‌లో అందరూ హోళీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ధూల్‌పేట్‌ మాత్రం గంజాయి మత్తులో మునిగి తేలుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లలో గంజాయిను కలిపి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ ధూల్‌పేట్‌ పేరుతో గంజాయిని మొత్తం నిరోధించేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తరుణంలోనే ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయాలు చాలావరకు తగ్గాయి. ధూల్‌పేట్‌లో నిరంతరం పోలీసుల నిఘా ఉంటుండటంతో శివారు ప్రాంతాలకు వెళ్లి గంజాయి విక్రయాలు చేపడుతున్నారు.

అయితే మార్చి 14న(గురువారం) హోళీ సందర్భంగా పోలీసు నిఘా తక్కువగా ఉంటారని భావించిన ధూల్‌పేట్ వాసులు కొంతమంది మళ్లీ గంజాయి విక్రయాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమానం రాకుండా కుల్ఫీ ఐస్ క్రీమ్‌లలో.. అలాగే బర్ఫీ స్వీట్లలో గంజాయిని కలిపి విక్రయాలు చేపడుతున్నారు.

ఐస్ క్రీమ్‌లు, స్వీట్ల మధ్యలో గంజాయిని అమ్ముతున్నారు అని సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు ధూల్‌పేట్‌కి చేరుకున్నారు. సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఐస్‌క్రీమ్‌లు విక్రయించేవాడని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు వద్ద నుంచి 100 కుల్ఫీ ఐస్ క్రీమ్‌లతో పాటు 72 బర్ఫీ స్వీట్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..