- Telugu News Photo Gallery Cinema photos Actress Sri Divya Latest Crazy Black Saree Photos Goes Viral
Sri Divya: బ్లాక్ శారీలో శ్రీదివ్య.. ఇంత అందాన్ని పట్టించుకోని టాలీవుడ్.. అక్కడ మాత్రం..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత కథానాయికగా మారింది. కెరీర్ తొలినాళ్లలోనే సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ శ్రీదివ్య. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Mar 14, 2025 | 12:18 PM

తెలుగులో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. కానీ ఈ వయ్యారికి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు.

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ సినిమాతో యూత్ ను ఆక్టటుకుంది. ఇందులో ప్రిన్స్ హీరోగా కనిపించగా.. శ్రీదివ్య కథానాయికగా కనిపించింది. ఆ తర్వాత మనసారా సినిమాలో మెరిసింది.

తెలుగులో హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మడు.. హీరోయిన్ గా మాత్రం సరైన క్రేజ్ అందుకోలేదు. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫిక్స్ షేర్ చేస్తుంది.

తాజాగా బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తుంది శ్రీదివ్య. ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇటీవలే సూపర్ హిట్ అయిన సత్యం సుందరం సినిమాలో కార్తీ జోడిగా కనిపించింది.





























