AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjanar: వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది.. పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్..

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తే రంగు పడుద్ది. పోలీస్‌ సింగం చూస్తోంది జర జాగ్రత్త! భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ...బెట్టింగ్‌ జోలికి.. వెళ్లకుండా ఉండడం బెటరూ అంటున్నారు సజ్జనార్‌. బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేసే సోషల్ మీడియా.. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు పోలీస్‌ ఫిట్టింగ్‌ తప్పదంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తన ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు సజ్జనార్‌.

Sajjanar: వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది.. పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్..
Sajjanar
Ravi Kiran
|

Updated on: Mar 14, 2025 | 9:05 PM

Share

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేస్తే రంగు పడుద్ది. యస్‌. పోలీస్‌ సింగం వార్నింగ్‌ ఇది. భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ…బెట్టింగు జోలికి వెళ్లకుండా ఉండడం బెటరూ అంటూ సలహా ఇస్తున్నారు మన ఖాకీ సింగం. ఆయన యూనిఫామ్‌లో ఉన్నా, లేకున్నా, సమాజ హితమే తన అభిమతం అంటూ ముందుకు సాగుతున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ భరతం పడుతున్నారు.

ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్… తనదైన శైలిలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌ని లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. తన ట్వీట్లకు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ట్యాగ్‌ చేసి పోలీసులను అలర్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్నారు. దీంతో వైజాగ్‌ పోలీసులు లోకల్‌ బాయ్‌ నానీని అరెస్ట్‌ చేసి లోపలేశారు. అలాగే సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నీ యాదవ్‌కి కూడా పోలీస్ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.

సజ్జనార్‌ చొరవతో పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై సీరియస్‌గా దృష్టి సారించడంతో…తెలుగు రాష్ట్రాల్లోని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌…. తమ సోషల్ మీడియా ఖాతాల్లోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగులపై ఓ కన్నెయ్యాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు. ఇక బెట్టింగ్‌ భూతం వల్ల చాలామంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. బెట్టింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్‌.

Follow Us
APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే దరఖాస్తులు
APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే దరఖాస్తులు
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే
ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..
ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..
ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..
ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..
కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..
కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..
భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!
భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్