AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలమాలో టాలీవుడ్ డైరెక్టర్స్.. కథ ఉన్నా హీరోలే దొరకట్లేదంట!

రిచ్ గెట్స్ రిచర్.. పూర్ గెట్స్ పూరర్ అంటూ శివాజీలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..! టాలీవుడ్‌లో ఇదే జరుగుతుందిప్పుడు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ రిచ్ పూర్ కాదు.. కథలు, హీరోలు. కొందరు దర్శకుల దగ్గర కథల్లేవు కానీ హీరో డేట్స్ ఉన్నాయి. ఇంకొందరి దగ్గర కథలున్నా హీరోల డేట్స్ లేవు. ఈ విచిత్రమైన పరిస్థితేంటో చూద్దామా..?

Samatha J
|

Updated on: Jan 28, 2025 | 1:28 PM

Share
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. క‌థ‌ రెడీ, నిర్మాత రెడీ గానీ హీరో దొరకట్లేదు. ‘ఖుషి’ తర్వాత శివ నిర్వాణకు హీరో దొరకట్లేదు. నాగ చైతన్య కోసం కథ సిద్ధం చేసినా.. అది సెట్స్ పైకి రావట్లేదు. దానికి కారణం ప్రస్తుతం చైతూ వరస సినిమాలతో బిజీగా ఉండటమే. తండేల్ తర్వాత కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్నారీయన.

1 / 5
Kushi1fam‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత పరశురామ్‌కు ఏ హీరో దొరకలేదు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్స్‌తో అగ్రిమెంట్స్ ఉన్నా.. సినిమా కుదరట్లేదు. కార్తి లాంటి హీరోలకు కూడా కథ చెప్పారు పరశురామ్. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి ఫైనల్ కాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు. ily Star

2 / 5
వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా సినిమా సినిమాకు భారీ గ్యాప్ తీసుకుంటారు వంశీ. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. ఏకంగా అమీర్ ఖాన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రానుంది.

3 / 5
డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పడం అంత ఈజీ కాదు.. ఇక ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి పరిస్థితి అంతే. పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిటైనా.. ఆయనున్న బిజీకి సినిమా మొదలవ్వడమైతే చాలా కష్టం.

4 / 5
శ్రీను వైట్ల సైతం విశ్వం తర్వాత ఓ కథ సిద్ధం చేసుకుని.. నెక్ట్స్ సినిమా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

5 / 5