AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవతార్ 3 పై బిగ్ అప్డేట్.. ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే!

అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది.. అవతార్ 2 నీళ్ళలో నడిపించేసారు.. మరి అవాతర్ 3 ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3ని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు..? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా..? పంచ భూతాలే అవతార్‌కు పునాది అయ్యాయా..? ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటి..?

Samatha J
|

Updated on: Jan 28, 2025 | 12:51 PM

Share
పేరుకు హాలీవుడ్ సినిమా అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేసాయి. అంతెందుకు రెండేళ్ళ కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2.

1 / 5
జేమ్స్ కెమారూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేసారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్ళలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కామేరూన్.

2 / 5
తాజాగా అవతార్ 3 అప్‌డేట్స్ వచ్చాయి. మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు.

3 / 5
అవతార్ తొలి రెండు భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయని ఊరిస్తున్నారు కామెరూన్. దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా వాడనున్నట్లు తెలిపారాయన.

4 / 5
కచ్చితంగా అవతార్ 3 ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అవుతుందంటున్నారాయన. మొత్తానికి పార్ట్ 1లో నేల, 2లో నీరు అయ్యాయి.. ఇప్పుడు 3లో నిప్పు ఉండబోతుంది. ఇక పంచ భూతాల్లో ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.

5 / 5