ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కలుస్తున్నాయంటే చాలు ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు మన హీరోలు కూడా. తమకు అచ్చొచ్చిన దర్శకులను ఓ పట్టాన వదలడానికి వాళ్లకు మనసు రావట్లేదు. అందుకే రెండు మూడేళ్ళకోసారి వాళ్లతోనే ఓ సినిమా అనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య, బన్నీ, రవితేజ అంతా ఇదే దారిలోనే వెళ్తున్నారిప్పుడు.