- Telugu News Photo Gallery Cinema photos Five films in the Sankranti ring will anyone drop out of the race?
Sankranthi Films: సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు.. ఎవరైనా రేసు నుంచి తప్పుకుంటారా..?
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే సినిమా పండుగే. టాప్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ సీజన్‌లో సత్తా చాటాలని కోరుకుంటారు. అందుకే ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలు ఒకే సీజన్‌లో చోటు ఉంటుందా..? లేకపోతే పెద్దల రాయభారంతో ఎవరైనా రేసు నుంచి తప్పుకుంటారా..? సంక్రాంతి బరిలో ఐదు సినిమాలో పోటి పడుతుండటం ఆసక్తికరంగా మారింది.
Updated on: Jan 04, 2024 | 7:47 PM

టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే సినిమా పండుగే. టాప్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ సీజన్‌లో సత్తా చాటాలని కోరుకుంటారు. అందుకే ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలు ఒకే సీజన్‌లో చోటు ఉంటుందా..? లేకపోతే పెద్దల రాయభారంతో ఎవరైనా రేసు నుంచి తప్పుకుంటారా..?

సంక్రాంతి బరిలో ఐదు సినిమాలో పోటి పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ, ఈగల్ సినిమాలు పోటి పడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో చర్చలు ప్రారంభించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది.

రిలీజ్‌కు రెడీ అవుతున్న ఐదుగురు నిర్మాతలతో మాట్లాడిన దిల్ రాజు, వాళ్లకు మంచి ఆఫర్ ఇచ్చారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాకు తరువాత సోలో డేట్ ఇస్తామని మాటిచ్చారు. సినీ పెద్దలు సర్ధి చెప్పగలరుగానీ, ఎవరి మీద ఒత్తిడి చేయలేమన్నారు దిల్ రాజు. పోటి నుంచి వెనక్కి తగ్గడానికి ఎవరు ఇష్టపడకపోతే అన్ని సినిమాలు అదే సీజన్‌లో రిలీజ్ అవుతాయి, కానీ అలా రిలీజ్ అవ్వటం ఏ సినిమాకు మంచిది కాదన్నారు.

బరిలో ఉన్న సినిమాల్లో ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను లాక్ చెయ్యని నా సామిరంగ కుడి లాక్ అయింది. దీంతో ఆ సినిమా తప్పుకుంటుందేమో అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇండస్ట్రీ పెద్దలు హనుమాన్ నిర్మాతలను వాయిదాకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే నార్త్‌లో బిజినెస్ పూర్తి కావటంతో వాయిదాకు నో అంటోంది హనుమాన్ టీమ్.

ఇక మిగిలిన సినిమాల్లో గుంటూరుకారం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితి లేదు. సైంధవ్ టీమ్ కూడా ప్రమోషన్ స్పీడు పెంచింది కాబట్టి వాయిదా పడే ఛాన్స్ కనిపించటం లేదు. దీంతో ఈగల్ విషయంలోనూ వాయిదాకు సంబంధించిన డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఫైనల్‌గా పోటికి నిలిచేది ఎవరో చూడాలి మరి.




