- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary confirmed in mahesh babu guntur karam movie with poster Telugu Actress Photos
Meenakshi Chaudhary: గుంటూరు ఘాటు.. మహేష్ బాబు పక్కన మీనాక్షి చౌదరి కనిపించిందండోయ్..
‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమె పాత్రను కానీ.. ఎలా ఉండబోతుందని గానీ పరిచయం చేయలేదు. టీజర్‌లో శ్రీలీలను చూపించకపోయినా.. ఆ తర్వాత వచ్చిన పాటల్లో మాత్రం ఆమెను బాగానే హైలైట్ చేసాడు గురూజీ. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటలో అయితే శ్రీలీల డాన్సులు నెక్ట్స్ లెవల్‌ల హైలైట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మీనాక్షిని మాత్రం ఇప్పటి వరకు చూపించకపోవడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అయినా త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.
Updated on: Jan 04, 2024 | 10:11 PM

‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమె పాత్రను కానీ.. ఎలా ఉండబోతుందని గానీ పరిచయం చేయలేదు. టీజర్‌లో శ్రీలీలను చూపించకపోయినా.. ఆ తర్వాత వచ్చిన పాటల్లో మాత్రం ఆమెను బాగానే హైలైట్ చేసాడు గురూజీ.

ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటలో అయితే శ్రీలీల డాన్సులు నెక్ట్స్ లెవల్‌ల హైలైట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మీనాక్షిని మాత్రం ఇప్పటి వరకు చూపించకపోవడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అయినా త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.

ఆయన ముందు సినిమాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అరవింద సమేతలో ఇషా రెబ్బా అయినా.. అల వైకుంఠపురములో సినిమాలో నివేదా పేతురాజ్ అయినా.. దానికి ముందు వచ్చిన అ.. ఆలో అనుపమ.. సన్నాఫ్ సత్యమూర్తిలో అదా శర్మ, నిత్యా మీనన్.. అత్తారింటికి దారేదిలో ప్రణీత.. ఇలా చెప్పుకుంటూ పోతే గురూజీ ప్రతీ సినిమాలోనూ ఇదే కనిపిస్తుంది.

ఏదో ఆ టైమ్‌కు స్టార్ హీరోతో కలిసి నటించామనే సంతృప్తి తప్పిస్తే ఆ హీరోయిన్‌కు మరో గుడ్ న్యూస్ ఏదీ ఉండదు. ఇప్పుడు గుంటూరు కారంలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తుంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ముందు మీనాక్షి కోసం అనుకున్న పాత్రలో శ్రీలీల నటించాలి.

త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ పూజా హెగ్డే అనుకోకుండా సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల వచ్చింది. ఇక శ్రీలీల స్థానమేమో మీనాక్షి చౌదరికి దక్కింది. ముందు సంయుక్త మీనన్‌కు ఈ ఛాన్స్ వస్తుందనే ప్రచారం జరిగినా.. చివరికి మీనాక్షి వైపు వెళ్లాడు త్రివిక్రమ్.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాలో ఉందనే విషయమే కానీ ఈమె లుక్ కూడా బయటికి రాలేదు. ఇన్నాళ్లకు మీనాక్షి చౌదరిని చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. అసలు సినిమాలో ఆమె ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్న సమయంలో ఆమె లుక్ రివీల్ చేసాడు. ఇందులో ఆమె రాజీ పాత్రలో నటిస్తుంది.

పరికిణీ వేసి ఓణీలో చాలా పద్ధతిగా తెలుగమ్మాయిగా కనిపించింది మీనాక్షి చౌదరి. ఇందులో ఈమెది చాలా చిన్న పాత్రే అని తెలుస్తుంది. ఈ కారెక్టర్‌తో మీనాక్షి జాతకం మారుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్లకు అంతగా గుర్తింపు రాదు.

మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు మీనాక్షి బ్రేక్ చెప్తుందా లేదా అనేది చూడాలి. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం. ముందు రోజు రాత్రి నుంచే హైదరాబాద్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.. మరోవైపు జనవరి 11 నుంచే ప్రీమియర్లు పడిపోతున్నాయి. జనవరి 6న ట్రైలర్ విడుదల కానుంది.




