Suriya-Kanguva: పాన్ ఇండియా వేటలో వెనకే ఉన్నా తమిళ తంబిల లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు.!
కంగువాపై ముందు నుంచి ఒకే మాటపై ఉన్నారు సూర్య. తమిళ సినిమా తనకు ఎంతో ఇచ్చింది.. తాను కూడా తమిళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి ఇవ్వాలి.. అదే కంగువా అంటున్నారీయన. కంగువాపై ఆయనకు అంత నమ్మకం ఏంటి.? నిజంగానే కంగువాతో సూర్య పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా.? బాహుబలి, ట్రిపుల్ ఆర్ రేంజ్లో కంగువా ఉండబోతుందా.? పాన్ ఇండియన్ సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ నుంచే వస్తాయని అంతా నమ్ముతున్నారిప్పుడు.