Date Seed Coffee: ఖర్జూరం గింజలతో కాఫీ..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

కాఫీ ప్రియులు చాలా మందే ఉంటారు.. అయితే, ఇటీవలి కాలంలో కెఫిన్‌ అధికంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదనే వైద్యుల సలహా మేరకు కాఫీ అంటే ఇష్టం ఉన్నా దానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే, మీరు కెఫిన్ లేని నేచురల్ కాఫీ తాగాలనుకుంటే ఖర్జూరం విత్తనాలు మీకు బెస్ట్‌ అప్షన్‌ అంటున్నారు నిపుణులు. ఖర్జూరం తినేశాక ఆ గింజలను పడేయకుండా వాటితో కాఫీ చేసుకుని తాగొచ్చు అని చెబుతున్నారు. పైగా డయాబెటిస్ ఉన్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 04, 2024 | 4:03 PM

ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. ఖర్జూరం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఖర్జూరంలో ఉండే విటమిన్స్, మినరల్స్ వల్ల కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క ఖర్జూరం తిన్నా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాంటి ఖర్జూరం విత్తనాలతో కాఫీ తయారు చేసి తీసుకుంటే కలిగే లాభాలు కూడా ఎక్కువే అంటున్నారు నిపుణులు.

1 / 6
అయితే, ఈ ఖర్జూరం విత్తనాలతో కాఫీ పౌడర్ తయారు చేయడానికి ముందుగా ఖర్జూరం విత్తనాలను తీసుకోవాలి. వాటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకుని సన్నని మంటపై వేయించాలి. సువాసన వచ్చే వరకు వేగిన విత్తనాలను చల్లార్చుకోవాలి. ఆ విత్తనాలను ఇప్పుడు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే.. ఖర్జూరం విత్తనాల కాఫీ పౌడర్ తయరవుతుంది.

2 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకి 2 లేదా 3 ఖర్జూరాలు తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖర్జూరంలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ లేకపోయినప్పటికీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందుకే ఖర్జూరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకు ఉంటుంది. అందువల్ల, రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగా పెరిగదు.

3 / 6
ఒంట్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఖర్జూరం విత్తనాలు ఉపయోగపడతాయి. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి ఖర్జూరం విత్తనాల కాఫీ తాగడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డయాబెటిస్ తగ్గించడంలో కూడా ఖర్జూరం విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

4 / 6
ఖర్జూరంలోని పీచు పదార్థం రక్తంలోని చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు. ఖర్జూరంలో ఉండే క్యాల్షియంతో పాటు మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.

5 / 6
అందుకే మితంగా కాఫీ తాగాలని చెబుతున్నారు. ఎందుకంటే కాఫీలోని సహజ రసాయనాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది స్ట్రోక్‌తో సహా గుండె సమస్యలను కలిగిస్తుంది. ఎస్ప్రెస్సో తాగని వారి కంటే రోజుకు మూడు నుండి ఐదు ఎస్ప్రెస్సోలు తాగేవారి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

6 / 6
Follow us