AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీసీ కుల గణనకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు.. ఛైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు

తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణనకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిషన్ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి ఈ బీసీ కుల గణన కీలకం కానుంది.

Telangana: బీసీ కుల గణనకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు.. ఛైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2024 | 9:17 PM

Share

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్డ్‌ ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు..ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. నెల రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది..ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన.. ఈ నెల 6నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు..ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌కు..చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. నిబంధనల ప్రకారం కుల గణన చేసే అధికారాలు ఈ కమిషన్‌కు మాత్రమే ఉంటాయి.

కులగణనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి..రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కోర్టు తీర్పులను అనుసరించాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. మరోవైపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ సర్వే ఆధారంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు..టీ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌..

తెలంగాణలో సమగ్ర కుల గణనకు బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో.. కులాలవారీ జనాభాను కూడా లెక్కిస్తారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడం దీని ఉద్దేశం..

తెలంగాణకు రాహుల్ గాంధీ..

మరోవైపు సమగ్ర కులగణన నేపథ్యంలో మంగళవారం తెలంగాణకు రానున్నారు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. సమగ్ర కులగణనపై వివిధ వర్గాల అభిప్రాయాలను వీరు తీసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..