Nithiin: వేరే హీరోలకు సాధ్యం కానిది.. నితిన్ ఒక్కడికే ఆ రికార్డ్ ఎలా సాధ్యం
నితిన్ గ్యారేజ్.. ఇక్కడ హిట్టు ఫ్లాపులతో పని లేదమ్మా..! వచ్చే దర్శకులు వస్తూనే ఉంటారు.. వచ్చే కథలు వస్తూనే ఉంటాయి.. నిర్మాతలు కూడా రెడీగానే ఉంటారు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేయడమే నా టార్గెట్ అంటున్నారు నితిన్. మిగిలిన మీడియం రేంజ్ హీరోలకు సాధ్యం కాని ఈ ఫీట్ కేవలం నితిన్ ఒక్కడే ఎలా చేస్తున్నారు..? సీక్రేట్ ఏంటి..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Mar 24, 2025 | 9:00 PM

ఎప్పుడూ చేతినిండా సినిమాలు.. క్రేజీ బ్యానర్లు.. పెద్ద పెద్ద హీరోయిన్లు.. హిట్ డైరెక్టర్లు.. ఇది సింపుల్‌గా చెప్పాలంటే నితిన్ కెరీర్. హిట్లలో ఉన్నా.. ఫ్లాపుల్లో ఉన్నా నితిన్ కెరీర్ మాత్రం ఎప్పుడూ ఒకేలాగే ఉంటుంది.

నాలుగేళ్లుగా హిట్ లేని నితిన్.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాబిన్ హుడ్ మార్చి 28న రానుంది.. తమ్ముడు మేలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు సాధ్యం కాని రికార్డును నితిన్ ప్రతీసారి అందుకుంటున్నారు.

ఫ్లాపుల్లో ఉన్నా.. ఈయనతో పని చేయడానికి క్రేజీ దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్, తమ్ముడు దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్నాయి.

నెక్ట్స్ ఎల్లమ్మ సినిమా కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారు. రాబిన్ హుడ్ తర్వాత తమ్ముడు సినిమాపై కాన్సట్రేట్ చేయనున్న నితిన్.. దీని తర్వాత బలగం వేణుతో ఎల్లమ్మను సెట్స్‌పైకి తీసుకొస్తారు.

దీని తర్వాత విక్రమ్ కే కుమార్‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ చేస్తున్నట్లు తెలిపారు ఈ హీరో. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. మొత్తానికి నితిన్ దూకుడు అలా ఉంటుంది మరి..!





























