Hai Nanna: సలార్ దెబ్బకు.. ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న మూవీ..
సడన్‌గా డైనోసార్ ఎంట్రీ ఇస్తే, సిట్చువేషన్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. గుట్టుగా డిసెంబర్‌లో అడుగుపెడదామనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు చెల్లాచెదరైపోతున్నాయి. డార్లింగ్ సలార్ రిలీజ్ డేట్ సీన్‌లోకి రాగానే అందరి దృష్టి ముందు నాని సినిమా హాయ్ నాన్న మీదే పడింది. ఆల్రెడీ దసరా సినిమాతో సక్సెస్ మీదున్న నాని, హాయ్ నాన్నతోనూ హిట్ పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా సలార్ డిసెంబర్ 22 మీద ఖర్చీఫ్ వేయడంతో, నాని సినిమా ప్రీ పోన్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
