- Telugu News Photo Gallery Cinema photos Gouri Kishan, Ashika Ranganath, Anikha Surendran made their debut in Tollywood but failed to get hits.
Tollywood: డెబ్యూతో సాలిడ్ హిట్ అందుకుందామనున్న ముద్దగుమ్మలు.. కానీ
'బుట్టబొమ్మ' సినిమాతో అనిఖ సురేంద్రన్ పరిచయమైంది. యాక్టింగ్ పరంగా నటిగా పాస్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
Updated on: Feb 21, 2023 | 8:55 PM

అనిఖ సురేంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు పరిచయమే.. అజిత్ నటించిన ఎంతవాడు కానీ, విశ్వసం సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

'బుట్టబొమ్మ' సినిమాతో అనిఖ సురేంద్రన్ పరిచయమైంది. యాక్టింగ్ పరంగా నటిగా పాస్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

96 సినిమాతో ఒక్కసారిగా అందరి మనసులు దోచేసింది ముద్దుగుమ్మ గౌరీ కిషన్. అదే సినిమా తెలుగులో జాను అనే పేరుతో రిలీజ్ అయ్యింది. అందులోనూ గౌరిని నటించింది.

'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమైంది. చబ్బీ లుక్ లో ఆకట్టుకుంది, కానీ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

నెల 10వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పరిచయం అయ్యింది ఆశికా రంగనాథ్.

సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. బ్యూటీ గ్లామర్ లుక్ తో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రొమాంటిక్ పెర్పార్మెన్స్ అమ్మడికి ఓ ఐడెంటిటీ తీసుకొచ్చింది




