Meetha Raghunath: కుర్రాళ్ల గుండెలు ముక్కలు.. భర్త గురించి ఒక్కమాటలో చెప్పేసిన గుడ్ నైట్ హీరోయిన్..
తమిళ్ హీరో మణికందన్ హీరోగా నటించిన గుడ్ నైట్ సినిమాతో తెలుగు అడియన్స్‌కు దగ్గరైంది మీతా రఘునాథ్. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో యూత్ ఫేవరెట్ క్రష్ లిస్ట్‌లో చేరిపోయింది మీతా రఘునాథ్. ఉంగరాల జుట్టు...అందమైన రూపం.. అమాయకమైన నటనతో తెలుగు కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకుంది.