- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress in this photo she is Premalu movie Heroine Mamitha Baiju telugu movie news
Tollywood: ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఒక్క సినిమాతో సెన్సెషన్ అయిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
పైన ఫోటోలో అందం, అభియనంతో మంత్రముగ్దులను చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆ నాట్య మయూరి ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. ఒక్క సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సెషన్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు అందరి ఫేవరేట్ ఈ ముద్దుగుమ్మే. ఎవరో తెలుసా ..ఆమె మరెవరో కాదు.. మలయాళీ హీరోయిన్ మమితా బైజు. ఈ పేరు చెబితే అందరికీ తెలియకపోవచ్చు.
Updated on: Mar 20, 2024 | 9:22 PM

పైన ఫోటోలో అందం, అభియనంతో మంత్రముగ్దులను చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆ నాట్య మయూరి ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. ఒక్క సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సెషన్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు అందరి ఫేవరేట్ ఈ ముద్దుగుమ్మే. ఎవరో తెలుసా ..

ఆమె మరెవరో కాదు.. మలయాళీ హీరోయిన్ మమితా బైజు. ఈ పేరు చెబితే అందరికీ తెలియకపోవచ్చు. కానీ సూపర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ తార.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేమలు పేరుతో డైరెక్టర్ రాజమౌళీ తనయుడు కార్తికేయ మార్చి 8న రిలీజ్ చేయగా.. సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఇటు తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది.

మమితా బైజు.. కేరళలోని కొట్టాయంలో జన్మించింది. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. స్కూల్ డేస్ లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. మమితా బైజు కెరీర్ తొలినాళ్లలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేసింది.

తొలి సినిమా సర్వోపరి పక్కరన్ ఇందులో ఆమె సహాయ నటిగా నటించింది. ఆ తర్వాత హానీ బీ : సెలబ్రెషన్స్ డాకినీ, స్కూల్ డైరీ, వికృతి, కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్, ఆపరేషన్ జావా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేమలు సినిమాతో స్టార్ డమ్ కొట్టేసింది.




