- Telugu News Photo Gallery Cinema photos Ee nagaraniki emaindi actress simran choudhary latest photos
అందాల భామ సిమ్రాన్.. ఈ సొగసరి పోజులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
సిమ్రాన్ చౌదరి 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకుంది, అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది. సినిమా రంగంలోకి ఆమె 2014లో వచ్చిన తెలుగు చిత్రం "హమ్ తుమ్" ద్వారా అడుగుపెట్టింది.
Updated on: Jun 03, 2025 | 9:19 PM

సిమ్రాన్ చౌదరి గుర్తుందా.? ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. సిమ్రాన్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది మరియు 12 ఏళ్ల వయసులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టింది.

సిమ్రాన్ చౌదరి 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకుంది, అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది. సినిమా రంగంలోకి ఆమె 2014లో వచ్చిన తెలుగు చిత్రం "హమ్ తుమ్" ద్వారా అడుగుపెట్టింది.

ఆ తర్వాత ఆమె "ఈనగరానికి ఏమైంది" "బొమ్మ భాట్", "చెక్" , "అథర్వ" , " పాగల్ " వంటి సినిమాల్లో నటించింది. సిమ్రాన్ చౌదరి తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

2024 నవంబర్‌లో హైదరాబాద్‌లో దేశంలోనే తొలి అత్యాధునిక "సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్"ను ప్రారంభించడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీఫుల్ ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.