మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్. ఇక రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.