- Telugu News Photo Gallery Cinema photos Does Kollywood have a pan India hit, Kanguva and Thangalaan flop
Suriya: కోలీవుడ్‌కి పాన్ ఇండియా హిట్.. తీరని కలేనా.? సూర్య కష్టం బూడిదలో పోసినట్టేనా.!
ఏళ్లకు ఏళ్లు కష్టపడి, ఫిజిక్ మెయింటెయిన్ చేసి, ఫిట్‌నెస్ కోసం స్ట్రగుల్ చేసి.. రాత్రనక, పగలనకా కష్టపడినప్పుడు మినిమమ్ రెస్పెక్ట్ కోరుకోవడంలో తప్పేం ఉంది.? దక్కాల్సిన గౌరవం దక్కకపోగా.. ఫ్లాప్ టాక్ పలకరిస్తే ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి? దీనికి సంబంధించి ఓపెన్ టాక్‌కి అవకాశం లేనప్పుడే.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ప్లానింగ్ చేంజ్ అవుతుందంటున్నారు సూర్యని దగ్గరగా చూసిన వారు.
Updated on: Nov 24, 2024 | 8:48 PM

కాశీ ఘాట్‌లో సూర్య, పూజ మధ్య సాగే సీన్ టీజర్‌లో ఆకట్టుకుంటోంది. రెట్రో పూర్తయిన వెంటనే ఆర్.జె.బాలాజీతో చేసే సినిమా కూడా యాక్షన్ ప్రధానంగానే ఉంటుంది.

శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న నడిప్పిన్ నాయగన్, దేశమంత తిరిగి సినిమాను ప్రమోట్ చేశారు.

కానీ సూర్య మాత్రం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను పట్టాలెక్కించారు. సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కంగువా.

వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరున్న సూర్య.. జస్ట్ మాస్.. నథింగ్ ఎల్స్ అనడానికి రీజన్ ఏంటి.? ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ దద్దరిల్లిపోయే సినిమా అంటూ కంగువను ప్రమోట్ చేశారు నడిప్పిన్ నాయగన్ సూర్య.

ఇలాంటి ప్రయోగాలతో పోలిస్తే, రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు.. డబ్బులకు డబ్బులు, హిట్‌కీ హిట్టూ వస్తాయనే మైండ్ సెట్‌కి సూర్య వచ్చేశారన్నది కోలీవుడ్ టాక్.

కార్తిక్ సుబ్బరాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది రెట్రో. చాన్నాళ్ల తర్వాత పూజా హెగ్డేకి ప్రామినెంట్ రోల్ కనిపిస్తోంది ఈ మూవీలో. సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు.

యాక్షన్ యాక్షన్ యాక్షన్.. యాక్షన్ తప్ప ఇంకేం ఆలోచించడం లేదు సూర్య. ఆయన ఫిల్మోగ్రఫీ మీద ఓ లుక్కేస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా నిరాశపరచటంతో సూర్య బ్రేక్ తీసుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఇండస్ట్రీ జనాలు.



