- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine is who has done two films in Tollywood, She is Disha Patani
చేసింది రెండు సినిమాలు.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. కోట్లల్లో ఆస్తిపాస్తులు
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు.
Updated on: Nov 14, 2025 | 2:46 PM

తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు.

పెళ్లి చేసుకొనో.. లేక అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యారు. ఒక ముద్దుగుమ్మ తెలుగులో రెండే సినిమాలు చేసింది. అందులో ఒకటి డిజాస్టర్ కాగా ఓ సినిమా సంచలన విజయం సాధించింది. కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం లేదు. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 3 కోట్లు వసూల్ చేస్తుంది ఈ చిన్నది. అలాగే ఆమె ఆస్తి పాస్తులు కూడా కోట్లల్లో ఉన్నాయి.

అంతే కాదు ఇండస్ట్రీలో ఆమెను మించిన హాట్ బ్యూటీ లేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆమె.. అందంలో అప్సరస.. కానీ తెలుగులో చేసిన సినిమాలు మాత్రం రెండు సినిమాలే ఒకటి డిజాస్టర్, మరో సినిమా భారీ హిట్. ఆమె ఎవరో కాదు దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ బాలీవుడ్ భామ తెలుగులో లోఫర్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడ వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలోనూ నటించింది ఈ చిన్నది.

కల్కి సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే చివరిగా కంగువ సినిమాలోనూ మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.




