- Telugu News Photo Gallery Cinema photos Director Rajamouli surprised the fans in the mobile phone ad
Rajamouli: అందులో జక్కన్న సర్‌ప్రైజ్ ఎంట్రీ.. క్రికెటర్‌తో రియల్ లైఫ్ క్యారెక్టర్..
సినిమా అభిమానులు రాజమౌళి నెక్ట్స్ మూవీ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే... జక్కన్న మాత్రం చిల్ మూడ్‌లో ఉన్నారు. సినిమా ఊసే ఎత్తకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ దర్శకధీరుడు ఏం చేస్తున్నారు హావ్ లుక్. ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంత వరకు రాజమౌళి నెక్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్‌తో మూవీ ఉంటుందన్న క్లారిటీ ఉన్నా... అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయం చెప్పలేదు.
Updated on: Apr 15, 2024 | 4:34 PM

సినిమా అభిమానులు రాజమౌళి నెక్ట్స్ మూవీ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే... జక్కన్న మాత్రం చిల్ మూడ్‌లో ఉన్నారు. సినిమా ఊసే ఎత్తకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ దర్శకధీరుడు ఏం చేస్తున్నారు హావ్ లుక్.

ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంత వరకు రాజమౌళి నెక్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్‌తో మూవీ ఉంటుందన్న క్లారిటీ ఉన్నా... అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయం చెప్పలేదు. కానీ జక్కన్న మాత్రం ప్రేక్షకులతో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటున్నారు.

ట్రిపులార్ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోల కన్నా జక్కన్నే ఎక్కువగా కనిపించారు. ఓవర్‌సీస్ రిలీజ్‌లు, అవార్డు ఫంక్షన్స్‌లో రాజమౌళి ప్రజెన్స్‌కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారు రాజమౌళి.

ఆ మధ్య ఓ మొబైల్ ఫోన్ యాడ్‌లో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు దర్శక ధీరుడు. తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన రాజమౌళి, యాడ్ ఫిలింతో ఫుల్ టైమ్ యాక్టర్‌గా మారిపోయారు. రీసెంట్‌గా మరో యాడ్‌లో తళుక్కుమన్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్‌తో కలిసి రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనూ ఫుల్ జోష్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసి మరీ, స్టేజ్ మీద స్టెప్స్ ఇరగదీశారు. జక్కన్న జోరు చూస్తుంటే మహేష్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసేసి చిల్ అవుతున్నట్టుగా ఉందంటున్నారు ఆడియన్స్.




