- Telugu News Photo Gallery Cinema photos Director Rajamouli Announced Prabhas Baahubali The Crown Of Blood Animated Series
Rajamouli – Baahubali: మరో బాహుబలి అనౌన్స్ మెంట్ చేసిన జక్కన్న.!
ప్యాన్ ఇండియా సినిమాల పేర్లతో డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారన్నది తరచూ వినిపించేమాట. ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీలతో..పెట్టిన ప్రతి పైసానూ ఎలాగోలా తిరిగి తెచ్చేసుకోవచ్చన్నది మేకర్స్ నమ్మకం. ఫ్లాప్ సినిమా సంగతేమోగానీ, సినిమా హిట్ అయితే మాత్రం చూసిన ప్రతి దిక్కు నుంచీ కాసులు కుమ్మరించేయొచ్చంటున్నారు టాలెంటెడ్ మేకర్స్.
Updated on: May 04, 2024 | 8:47 PM

ప్యాన్ ఇండియా సినిమాల పేర్లతో డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారన్నది తరచూ వినిపించేమాట. ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీలతో..పెట్టిన ప్రతి పైసానూ ఎలాగోలా తిరిగి తెచ్చేసుకోవచ్చన్నది మేకర్స్ నమ్మకం.

ఫ్లాప్ సినిమా సంగతేమోగానీ, సినిమా హిట్ అయితే మాత్రం చూసిన ప్రతి దిక్కు నుంచీ కాసులు కుమ్మరించేయొచ్చంటున్నారు టాలెంటెడ్ మేకర్స్.

బాహుబలి సినిమా వచ్చి ఎన్నేళ్లయింది.. ఇంకా ఏదో రకంగా సౌండ్ చేస్తూనే ఉంది ఆ మూవీ. అన్నివైపుల నుంచి అంత మంది తదేకంగా పిలుస్తూ ఉంటే, అతని రాకను ఎవరు ఆపగలరు అంటూ బాహుబలి యానిమేటెడ్ వెర్షన్ గురించి తనదైన స్టైల్‌లో రీసెంట్‌గా అనౌన్స్ చేశారు జక్కన్న.

మాహిష్మతి సామ్రాజ్యాన్ని మనసారా మరోసారి చూసుకుంటున్నారు ఆడియన్స్. ప్రభాస్ బాహుబలి మాత్రమే కాదు, సలార్ సినిమా కూడా ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది శౌర్యాంగపర్వం. ఆగస్టు 10 నుంచి శౌర్యాంగపర్వం షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రభాస్‌కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న జపాన్‌లో సలార్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రభాస్, పృథ్విరాజ్, శ్రుతిహాసన్ నటించిన ఈ మూవీకి అక్కడ క్రేజ్ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్ తరహా మేకింగ్ స్టైల్‌తో జపాన్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం కోసం రెడీ అవుతోంది సలార్.




