- Telugu News Photo Gallery Cinema photos Dil Raju Wife Tejaswini Visits Paris Eiffel Tower, See Photos
Dil Raju: సమ్మర్ వెకేషన్‌లో దిల్ రాజు భార్య.. ఈఫిల్ టవర్‌ను చూసి మురిసిపోయిన తేజస్విని.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని సమ్మర్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పర్యటిస్తోన్న ఆమె అక్కడి ప్రకృతి అందాలను బాగా ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు వెకేషన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: May 19, 2025 | 4:32 PM

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తోంది. సమ్మర్ వెకేషన్ లో భాగంగా అక్కడికి వెళ్లిన ఆమె ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది.

తాజాగా ఫారిన్ లో ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను సందర్శించింది తేజస్విని. అక్కడ ఫొటోలు దిగిన ఆమె వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది.

ఈ ఫొటోల్లో చీర కట్టుకుని ఎంతో అందంగా కనిపించింది తేజ స్విని. ప్రస్తుతం ఆమె వెకేషన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తేజస్విని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.

తమ్ముడు సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ లయ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది.




