Ram Charan: రామ్ చరణ్ బిగ్ డెసిషన్.. షాక్ లో సుకుమార్
ప్రజెంట్ పెద్ది వర్క్‌లో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టి మరో క్రేజీ కాంబోను తెర మీదకు తీసుకువస్తున్నారు. చరణ్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవటం వెనుక రీజనేంటి..? ఈ స్టోరీలో చూద్దాం. గేమ్ చేంజర్‌తో నిరాశపరిచన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నెక్ట్స్ మూవీతో అభిమానుల ఆకలి తీర్చాలని కష్టపడుతున్నారు.
Updated on: May 19, 2025 | 4:45 PM

గేమ్ చేంజర్‌తో నిరాశపరిచన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నెక్ట్స్ మూవీతో అభిమానుల ఆకలి తీర్చాలని కష్టపడుతున్నారు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.

ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రంగస్థలం కన్నా బాగుంటుందని హామీ ఇస్తున్నారు చెర్రీ. పెద్ది తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు చరణ్.

చాలా రోజుల కిందటే ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. రంగస్థలం తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో మంచి బజ్ క్రియేట్ చేసింది కూడా.

కానీ ఇప్పుడు సుక్కు కన్నాముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు మెగా పవర్ స్టార్. పెద్ది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్.

త్రివిక్రమ్‌కు అత్యంత సన్నిహితుడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. అందుకే చరణ్ కూడా ఉన్న ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.




