- Telugu News Photo Gallery Cinema photos Did Nayanthara reject Power Star Pawan Kalyan's blockbuster movie?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ రిజక్ట్ చేసిన నయన్?
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ లో వరస సినిమాలు చేసి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ బ్యూటీ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా సినిమాలు చేసింది. కానీ తెలిసి తెలిసి స్టార్ హీరో సినిమాను మిస్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరీ ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సినిమాను ఎందుకు రిజక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Apr 06, 2025 | 8:20 PM

నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ బ్యూటీ.టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి,మంచి గుర్తింపు సంపాదించుకుంది. లేడి ఓరియెంటెండ్ సినిమాల్లో కూడా ఈ అమ్మడు తన నటతో అందరినీ ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో చాలా మంది హీరోల సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.

ముఖ్యంగా ఏ హీరోయిన్ అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఆ అవకాశం అస్సలే వదులుకోవాలి అనుకోదు.కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తెలిసి తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను రిజక్ట్ చేసింది. ఇంతకీ అది ఏ మూవీ అంటే?

పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబోల వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వకీల్ సాబ్ మూవీ వచ్చింది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమాలో మొదట నయనతారను సెలక్ట్ చేశారు మూవీ డైరెక్టర్. కానీ పాత్ర చిన్నగా ఉండటంతో నయన్ ఆ సినిమాను రిజక్ట్ చేసిందంట.





























